Advertisementt

జైలర్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్న బాలయ్య

Wed 30th Apr 2025 06:19 PM
balakrishna  జైలర్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్న బాలయ్య
Balakrishna Onboards Jailer 2 జైలర్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్న బాలయ్య
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ కోలీవుడ్ లో రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కనిపిస్తే ఎంత బావుండేది, జైలర్ హిట్ ఫుల్ ఫీల్ అయ్యేది అని నందమూరి అభిమానులు మాత్రమే కాదు చాలామంది మూవీ లవర్స్ అనుకున్నారు. జైలర్ చిత్రంలో కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ గెస్ట్ రోల్స్ చెయ్యడంతో తెలుగు నుంచి బలయ్య కూడా జైలర్ లో గెస్ట్ రోల్ లో మెరిస్తే బావుండేది అనుకున్నారు. 

ఇప్పుడా సర్ ప్రైజ్ దర్శకుడు నెల్సన్ జైలర్ 2లో ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు జైలర్ 2లోను కంటిన్యూ అవుతాయని, అయితే జైలర్ 2లో అందరూ అనుకుంటున్నట్టుగా బాలయ్య ఉన్నారో, లేదో అని శివరాజ్ కుమార్ రీసెంట్ గా ఓ ప్రెస్ మీట్ లో చెప్పి అందరిని కన్ఫ్యూజన్ లో పడేసినా.. తాజాగా జైలర్ 2లో బాలకృష్ణ నటించబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. 

బాలయ్య జైలర్ 2 లో నటించడం ఖాయం, ఆయన పాత్ర కూడా లాకైపోయింది, త్వరలోనే జైలర్ వరల్డ్ లోకి బాలయ్య ఎంటర్ అవుతారనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్, ఇంకా టీమ్ మొత్తం కేరళ వెళ్ళింది. అక్కడే జైలర్ 2 షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది. నిజంగా జైలర్2 లో బాలయ్య కూడా యాడ్ అయితే ఆ ఆకర్షణే వేరు అని బాలయ్య ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Balakrishna Onboards Jailer 2:

Balakrishna joins Rajinikanth Jailer2

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ