కొన్నేళ్లుగా బంగారం షాప్ యజమానులు అక్షయతృతీయ పేరు చెప్పి కొన్ని కోట్లలో బిజినెస్ చెయ్యడం చూస్తున్నాం. కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసేందుకు నో వెస్టేజ్, నో మేకింగ్ అంటూ ఆఫర్లతో ఊదరగొట్టేవారు. అంతేకాదు ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ అంటూ కళ్ళు చెదిరే ఆఫర్స్ ప్రకటించి కస్టమర్స్ ని ఆకర్షించేవారు.
కస్టమర్స్ కూడా గోల్డ్ షాప్స్ ఇచ్చే ఆఫర్స్ కోసం, అక్షయ తృతీయ రోజున బంగారం కొని లక్ష్మి దేవిని ఇంటికి తీసుకెళితే సంవత్సరం అంతా బంగారం కొనుక్కోవచ్చనే ఆశతో అక్షయ తృతీయ రోజు బంగారం కొనేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కనీసం ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అయినా కొని ఇంటికి తీసుకెళ్లే కస్టమర్స్ ఉన్నారు. ధనిక,పేద ఇలా ప్రతి ఒక్కరూ బంగారం కొనేందుకు ఉత్సాహం చూపించేవారు.
అక్షయ తృతీయ ముందు రోజు నుంచే గోల్డ్ షాప్స్ కస్టమర్స్ తో కళకళలాడేవి. కానీ ఈ ఏడాది అక్షయ తృతీయ కు మాత్రం గోల్డ్ షాప్స్ వెలవెలబోతున్నాయి. గోల్డ్ షాప్ లో ఎక్కడా కస్టమర్స్ కళకళ లేదు. ఎవరో ఎక్కడో ఒకరు అత్యంత అవరసమైతే తప్ప గోల్డ్ షాప్ కి రావడమే లేదు. ఎంతోసెంటిమెంట్ ఉన్న కస్టమర్స్ కూడా గోల్డ్ షాప్ వైపు చూడకపోవడం నిజంగా ఆశ్చర్యమే.
అందులో ఆశ్చర్యం ఏముంది. బంగారం ధర ఆకాశాన్నంటింది. 10 గ్రాముల బంగారం ఇప్పుడు అక్షరాలా లక్ష చేరువ కు చేరింది. మరి లక్ష పెట్టి బంగారం కొనేవాళ్ళు ఉన్నారా, ఆకాశాన్ని తాకిన బంగారం ధర ను ఎవరు మాత్రం అందుకుంటారు. చిన్నా లేదు, పెద్దా లేదు ఎవ్వరూ ఈ అక్షయతృతీయకు బంగారం కొనే ఉత్సాహం చూపించలేదు. అందుకే నేడు ఏప్రిల్ 30 గోల్డ్ షాప్స్ అన్ని వెలవెల బోతూ కనిపించాయి.
ఈ ఏడాది అక్షయ తృతియపై బంగారం లక్షకు చేరిన ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.