Advertisementt

ఆసుపత్రిలో చేరిన కోలీవుడ్ హీరో అజిత్

Wed 30th Apr 2025 04:41 PM
ajith  ఆసుపత్రిలో చేరిన కోలీవుడ్ హీరో అజిత్
Kollywood hero Ajith admitted to hospital ఆసుపత్రిలో చేరిన కోలీవుడ్ హీరో అజిత్
Advertisement
Ads by CJ

రెండు రోజుల క్రితమే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్న కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ తన సక్సెస్ కి కారణం తన భార్య షాలిని, ఆమె వలనే ఇదంతా సాధించాను అని చెప్పిన విషయం తెల్సిందే. భార్యతో కలిసి పద్మభూషణ్ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లిన అజిత్ ఇంతలోనే ఆసుపత్రిలో చేరారనే వార్త అభిమానులను ఆందోళన పెట్టింది. 

అసలే ఈ మధ్యన అజిత్ కార్ రేస్ లో ప్రమాదాల బారిన పడి తప్పించుకుంటున్నారు. అలాంటి అజిత్ సడన్ గా ఆసుపత్రిలో చేరడం మాత్రం షాకిచ్చింది. అసలు అజిత్ ఎందుకు ఆసుపత్రిలో చేరారు అంటే.. ఆయన పద్మభూషణ్ అవార్డు అందుకుని తిరిగి చెన్నై చేరుకున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లో అజిత్ అభిమానులు అక్కడికి ఒక్కసారిగా చేరుకొని గందరగోళం సృష్టించడంతో అక్కడ తోపులాటలో అజిత్ చేతికి గాయమైనట్లుగా తెలుస్తుంది. 

దానితో ఆయన ఆపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా సమాచారం. అది చిన్న గాయమే అని, అజిత్ ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది, అభిమానులెవరు ఆందోళన పడవద్దని అజిత్ సన్నిహితులు సమాచారం అందించారు. 

Kollywood hero Ajith admitted to hospital:

Ajith Kumar hospitalised in Chennai for medical treatment

Tags:   AJITH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ