Advertisementt

అయ్యో ఆమె అందాల పోటీ నుంచి అవుట్

Wed 30th Apr 2025 11:53 AM
smita sabharwal  అయ్యో ఆమె అందాల పోటీ నుంచి అవుట్
TG government transfers Smita Sabharwal IAS అయ్యో ఆమె అందాల పోటీ నుంచి అవుట్
Advertisement
Ads by CJ

కష్ట పడు – ఫలితం ఆశించకు అని అర్థం వచ్చే భగవద్గీత సూక్తిని సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ చూస్తే రకరకాల అనుమానాలు కలగక మానదు. కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కనబడిన స్మిత సబర్వాల్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అంటీముట్టనట్టుగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అందుకే స్మిత సబర్వాల్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చుక్కలు చూపించేందుకు రెడీ అవడమే కాదు అప్పుడే ఆచరణలో పెట్టేసింది. 

స్మిత సబర్వాల్ కు అత్యంత ఇష్టమైన మిస్ వరల్డ్ పోటీలు టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆ పోటీలకు తెలంగాణలో జరగడానికి ఆమె కృషి ఎంతో ఉంది! ఈ పోటీల నిర్వహణ కోసం ఆమె చాలా కష్ట పడ్డారు! స్వయంగా ఫ్యాషన్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న అధికారిణి కావడంతో మోడల్స్, అందాల భామలతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందంలో వారితో పోటీ పడుతున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అందాల పోటీల్ని అంతే అద్భుతంగా నిర్వహించి తెలంగాణ టూరిజాన్ని గొప్పగా ప్రమోట్ చేసే ప్రణాళికలు వేసుకున్నారు. ప్రభుత్వం పై భారం పడకుండా ఉండాలని వివిధ సౌజన్యాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు! 

అందాల పోటీలు మే 7 నుంచి ప్రారంభం కానున్నాయి!  వారం రోజుల ముందే ఆమెపై బదిలీ వేటుపడింది! ప్రాధాన్యం లేని ఫైనాన్స్ కార్పొరేషన్ కు బదిలీ చేశారు! అందాల పోటీల వరకు పర్యాటక శాఖలో ఉంచితే తన వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఉండేదని ఆమె అంటున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్, మిస్ ఇండియాలను హైదరాబాద్ ఆహ్వానించి, యాదగిరి గుట్ట, రామప్ప సందర్శించేలా చేశారు. ఇప్పుడు  రేవంత్ రెడ్డి ఆమెను అందాల పోటీలకు దూరంగా ఉంచారు! ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏ ముఖ్యమంత్రికి అయినా దగ్గరయ్యే జయేష్ రంజన్ కు అందాల పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు! ఆయనకు ఇలాంటి సోషలైట్, నైట్ లైఫ్ కార్యక్రమాల జోష్ ఉంది! పైగా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక పెట్టుబడుల శాఖ సిఇవో గా నియమితులయ్యారు! అందాల పోటీ వరకు అదనంగా పర్యాటక సాంస్కృతిక శాఖ ఇంచార్జ్ పగ్గాలు కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి. 

అన్నీ సిద్ధం చేసిన స్మిత నిరాశకు గురయ్యారు. నిజానికి గత ప్రభుత్వ పెద్దలతో ఆమె ఎంతో సన్నిహితంగా ఉన్నారు. కెసిఆర్ హయాంలో ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్నీ తానై వ్యవహరించారు.  కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆసక్తి చూపించలేదు! సెలవులో వెళ్తారని అందరూ భావించారు!  కొద్ది రోజుల తర్వాత ఆమెకు టూరిజం లాంటి ప్రాధాన్యత పోస్టింగ్ దక్కింది. కానీ, కంచ గచ్చిబౌలి ఏఐ ఫోటోలను షేర్ చేసుకుని ప్రభుత్వంతో తన సంబంధాలను పూర్తిగా చెడగొట్టుకున్నారు. పైగా పోస్ట్ చేసిన రెండు వేల మందిపై కేసులు పెడతారా అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది! ఇప్పుడు టూరిజం నుంచి బదిలీ చేసేసి అప్రాధాన్యత పోస్టులో వేసేసారు! అలా స్మిత అందాల పోటీల నుంచి అవుట్ అయ్యింది. 

TG government transfers Smita Sabharwal IAS:

Telangana government transfers Smita Sabharwal IAS days after AI image row

Tags:   SMITA SABHARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ