మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా వరుణ్ తేజ్ కి భార్య, నాగబాబు ఇంట కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుంది. నిన్నగాక మొన్న ఎమ్యెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు ఇంట మరో గుడ్ న్యూస్ వినిపించబోతుంది. ఆయన ఇంటికి వారసుడు రాబోతున్నాడు. వరుణ్ తేజ్ తండ్రిగా ప్రమోట్ కాబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు కనిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు కనబడుతున్నాయి. మరి అధికారికంగా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ తండ్రి కాబోతున్నాడన్న వార్త రాకపోయినా ప్రస్తుతం మెగా చిన్న కోడలు తల్లికాబోతున్న విషయం మాత్రం నెట్టింట సంచలంగా మారింది. 2023 నవంబర్ లో వరుణ్ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకున్న లావణ్య పెళ్లి తర్వాత కూడా నటనను కొనసాగిస్తుంది.
అటు కోడలిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇటు కెరీర్ ని చక్కదిద్దుకుంటున్న లావణ్య అత్తమామలకు, మెగా అభినులకు గుడ్ న్యూస్ వినిపించబోతుంది. మరి ఆ వార్తేదో అఫీషియల్ గా వస్తే మెగా అభిమానులకు మరింత ఆనందంగా ఉంటుంది.