కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. తన భార్య షాలిని పై ప్రశంశల వర్షం కురిపించారు. నేను ఎంత సంపాదించినా ఇప్పటికి కామన్ మ్యాన్ లా ఉండడానికే ఇష్టపడతాను. ఒక్కోసారి న లైఫ్ స్టయిల్ నాకే షాకింగ్ గా అనిపిస్తుంది.
నేను ఈ స్థాయిలో ఉండడానికి నా వైఫ్ షాలిని నే ప్రధాన కారణం. ఆమె నాకు ప్రతి పనిలో తోడుండడమే కాదు, నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నేను ఒక్కోసారి సరైన డెసిషన్ తీసుకోలేకపోయినా ఆమె నాకు తోడుగా నిలబడింది. నా కష్ట సమయంలో నా పక్కనే ఉండి నన్ను నడిపించింది. నా లైఫ్ లో నేను సాధించిన సక్సెస్ క్రెడిట్ మొత్తం నా భార్య షాలిని కే ఇస్తాను.
తాను ఎంతో పెద్ద హీరోయిన్, ఆమెకి ఎంతోమంది అభిమానులున్నారు. కానీ నా కోసం ఆమె అన్ని వదులుకుంది. ఆమె అభిమానులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెలుపుతాను. నాకు సూపర్ స్టార్ అనే ట్యాగ్స్ అంటే నమ్మకం ఉండదు, అందుకే అలాంటి ట్యాగ్స్ తో పిలిపించుకోవడం ఇష్టమ్ ఉండదు. అభిమానులను ఎంటర్టైన్ చెయ్యడానికి లైఫ్ లాంగ్ ట్రై చేస్తాను, నేను ఓ నటుడిని, నటననే నేను ఉద్యోగంలా భావిస్తాను. నటనతో పాటుగా ఇతర వ్యాపకాలు ఉన్నాయి, అతిగా ఆలోచించను అంటూ అజిత్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.