పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఈ ఏప్రిల్ ల్లో రావాల్సిన రాజా సాబ్ వాయిదా పడింది. దర్శకుడు మారుతి రాజా సాబ్ టీజర్ కట్ చేసారు అంటూ చెప్పడమే కానీ ఆ రాజా సాబ్ టీజర్ ఎప్పుడు వస్తుందో అనేది తెలియదు. ఇక ప్రభాస్ ఇప్పుడు ఇటలీలో వేసవి వెకేషన్ లో ఉన్నారని, సమ్మర్ అయ్యేవరకు ప్రభాస్ ఇటలీ నుంచి రారు అని తెలుస్తోంది.
మరోపక్క రాజా సాబ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది, అలాగే పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. ఈ లెక్కన మే తర్వాత కానీ రాజా సాబ్ మిగిలిన షూటింగ్ పూర్తవుతుంది. మరి దసరాకు రాజా సాబ్ వస్తుందా, లేదా అనే విషయం పక్కన పెడితే ఈ ఏడాది రాజా సాబ్ వస్తే దసరాకు లేదంటే ఈ ఏడాది రాజా సాబ్ రాకపోవచ్చని సోషల్ మీడియాలో కనిపించిన ఓ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ మోడ్ లోకి వెళుతున్నారు.
అటు హను రాఘవపూడి షూటింగ్ కూడా వాయిదాపడింది. మరి రాజా సాబ్ సెప్టెంబర్ కానీ లేదంటే దసరా కి రిలీజ్ అవ్వకపోతే ఈఏడాది ఉండకపోవచ్చనే గాలి వార్త చూసి చాలామంది అయ్యా బాబోయ్ రాజా సాబ్ విషయంలో ఈ ట్విస్ట్ ఊహించలేదు గురు అంటూ కామెంట్లు పెడుతున్నారు.