పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఆయన తరుచు అనారోగ్యానికి గురవుతున్నారు. వైరల్ ఫీవర్ లేదంటే నడుం నొప్పి తో పవన్ కళ్యాణ్ పలుమార్లు అనారోగ్యం బారిన పడడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్ళొచ్చాక ఏపీ క్యాబినెట్ సమావేశానికి వెళుతున్న సందర్భంలో ఆయనకు వెన్ను నొప్పి తిరగబెట్టింది..
అందుకే ఆయన అటు నుంచి అటే క్యాంప్ కార్యాలయానికి వెళ్ళిపోయి రెస్ట్ తీకుంటున్నారు అన్నారు. కానీ నిన్న పవన్ ఓ కార్య్రక్రమంలో కనిపించినప్పుడు పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ పెట్టిన సూది గుర్తులు కనిపించడం చూసి అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైంది, బ్యాక్ పెయిన్ అయితే సెలైన్ ఎందుకు పెట్టారు అంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిన్న పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు తో కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేతికి సెలైన్ పెట్టిన గుర్తులు చూసి ఆయన అభిమానులు మాత్రం పవన్ కి అసలు అనారోగ్యం ఏమిటో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.