టాలెంటెడ్ నటి, అందానికి అందం, అభినయానికి అభినయంతో కట్టిపడేసే అభినయ ఫైనల్ గా పెళ్లి పీటలెక్కింది. కోరుకున్న ప్రియుడితో ఏడడుగులు వేసింది. హైదరాబాద్‌కు చెందిన కార్తీక్ ను అభినయ నిన్న బుధవారం పెళ్లి చేసుకుని వివాహబంధం లోకి అడుగుపెట్టింది. అభినయ-వేగేశ్న కార్తీక్ ల వివాహం జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
అభినయ, కార్తీక్ వేగేశ్న చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్ షిప్ ప్రేమగా మారి పెళ్లి బంధానికి పునాదులు వేసింది. రీసెంట్ గానే కార్తీక్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ ప్రేమని చెప్పిన అభినయ ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అభిమానులు అభినయ-కార్తీక్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అభినయ-కార్తిక్ ల వెడ్డింగ్ రిసెప్షన్ ఈ నెల 20న నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలుస్తోంది.