17 కేసుల్లో నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చి విడుదలయ్యే సమయంలో గుంటూరు సీఐడీ పోలీసులు మరోసారి షాకిచ్చారు. ప్రస్తుతం రిమండ్ లో ఉన్న పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని ఏపీ సీఐడీ అధికారులు విచారించారు.
దాదాపు నాలుగు గంటల సేపు పోసాని కృష్ణమురళి విచారణ కొనసాగింది. విచారణ ముగియడంతో పోసానికి గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది.