పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో తెరకెక్కుతున్న రాజా సాబ్ ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ చిత్రం విడుదల పోస్ట్ పోన్ అవ్వనుంది. తాజాగా రాజా సాబ్ మ్యూజిక్ ఆల్బమ్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
రాజా సాబ్ కోసం ఇప్పటికే చాలా ట్యూన్స్ చేసాము, కానీ అవన్నీ చెత్తబుట్టలో వేసేసం, మళ్లీ కొత్త ట్యూన్స్ ని ప్రిపేర్ చేస్తున్నాం. కారణం ట్రెండ్ మారిపోయింది. టెక్నాలజీకి తగినట్టుగానే కొత్త ట్యూన్స్ ఇవ్వాలి, అప్పుడెప్పుడో రెడీ చేసిన పాటలన్ని ఇపుడు పనికి రాకుండాపోయాయి.
మళ్ళీ కొత్త పాటలు రెడీ చెయ్యాలనే డెసిషన్ నేనే తీసుకున్నాను, అంతేకాదు దర్శకనిర్మాతలకు చెప్పి ఒపించాను, ట్రెండ్ కు తగ్గట్టు, పాన్ ఇండియా ఆడియన్స్ కు తగ్గట్టు పాటలు రెడీ చేస్తున్నాను అంటూ చెప్పడంతో రాజా సాబ్ వాయిదాకి థమన్ పాటల మార్పిడి కూడా కారణమై ఉండొచ్చనే వాదన మొదలైంది.