రాజమౌళి SSMB 29 సెట్స్ లో ఎన్నిరూల్స్ పెట్టినా జరిగేవి జరక్క మానడం లేదు. ఫోన్స్ తీసుకుని ఎంతగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా SSMB 29 లీకులు ఆగడం లేదు. ఈమధ్యన ఒడిశాలోని కోరాపుట్ లో జరుగుతున్న SSMB 29 అవుట్ డోర్ షూట్ లీకై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానితో రాజమౌళి అక్కడ సెక్యూరిటీని టైట్ చేసారు.
తాజాగా SSMB 29 సెట్స్ లో రాజమౌళి కొత్త రూల్స్ పెట్టారట. ఈచిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కీలకపాత్రల్లో కనిపిస్తుండగా, చాలామంది క్రేజీ నటులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. అయితే సెట్ లోకి వెళ్లే స్టార్ హీరోలకు, హీరోయిన్స్ కు ఒక్కో స్టార్ కి పదిమంది అసిస్టెంట్స్ ఉంటారు. కానీ రాజమౌళి మహేష్, ప్రియాంక, పృథ్వీ రాజ్ ఇలా స్టార్ నటులకు కేవలం ఇద్దరి అసిస్టెంట్స్ మాత్రమే సెట్ లో అలోవ్ చేస్తున్నారట.
అంతేకాకుండా SSMB 29 సెట్ లో ప్లాస్టిక్ ని నిషేదించారట. షూటింగ్ స్పాట్ ని పొల్యూషన్ ఫ్రీగా మార్చేందుకు రాజమౌళి స్ట్రిట్ రూల్స్ పెట్టారట. మరి ఇలాంటి రూల్స్ పాటించడం పట్ల నెటిజెన్స్ రాజమౌళిని తెగ మెచ్చేసుకుంటున్నారు.