ముంబైలో క్రేజీ ప్యాలెస్ మన్నత్ లో నివాసముండే షారుఖ్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు మన్నత్ నుంచి బయటికి మూవ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే. ముంబై బాంద్రాలోని ఈ కాస్ట్లీ మన్నత్ ను షారుక్ అండ్ ఫ్యామిలీ ఎందుకు విడిచి వెళుతుందో చాలామంది అభిమానులకు అర్ధం కాక ఆందోళన పడ్డారు. కానీ షారుఖ్ ఈ ఐకానిక్ బిల్డింగ్ ని రెనోవేషన్ చేయించబోతున్నారట.
మన్నత్ ను ఈ సమ్మర్ అంటే మే లో రిపేర్లు చేసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ధేందుకు గాను షారుఖ్ ఫ్యామిలీ మన్నత్ ను వదిలి వేరే చోటుకి మూవ్ అవుతున్నారని, అది కూడా రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ కి సంబందించిన ఇంటికి షారుక్ అండ్ ఫ్యామిలీ షిఫ్ట్ అవుతున్నారనే వార్త బాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
రకుల్ మామగారుకు సంబందించిన ముంబై లోని బాంద్రా ప్రాంతంలో ఉన్న పూజా కాసా అనే విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కి షారుఖ్ ఫ్యామిలీ తో కలిసి వెళ్ళబోతున్నారట. రకుల్ ప్రీత్ ప్రస్తుతం తన భర్త జాకీ భగ్నానీతో కలిసి ఇదే అపార్ట్మెంట్ లో నివశిస్తోంది. షారుఖ్ ఈ భవనంలో రెండు డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌లను అద్దెకు తీసుకున్నారని, ఓ మూడేళ్లపాటు లీజు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని టాక్.
పూజా కాసా భవంతిలో మొదటి, రెండవ అంతస్తులను, ఏడు, ఎనిమిది అంతస్తులను షారుఖ్ అద్దెకు తీసుకున్నారట. సో రకుల్ ఇంట్లోకి షారుఖ్ అతి త్వరలోనే షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది.