లవ్ టు డే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రదీప్ రంగనాధన్ రీసెంట్ గా రిటర్న్ అఫ్ ది డ్రాగన్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేశావయ్యారు. ఈ చిత్రం తెలుగులో బిగ్ హిట్ అయ్యింది. అంతేకాదు తమిళ్ లో 100 కోట్లు కొల్లగొట్టింది రిటర్న్ అఫ్ ది డ్రాగన్ . దానితో ప్రదీప్ రంగనాధన్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది.
థియేటర్స్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా యువతను ఆకర్షించిన రిటర్న్ అఫ్ ది డ్రాగన్ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. రిటర్న్ అఫ్ ది డ్రాగన్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది..
రిటర్న్ అఫ్ ది డ్రాగన్ థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ చిత్రాన్ని మార్చ్ 21 నుంచి అంటే శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ లోకి తేబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు.