మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ హీరో గానే కాదు దర్శకుడి గాను పలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించి డైరెక్ట్ చేసిన లూసిఫర్ సీక్వెల్ L2 విడుదలకు సిద్ధమైంది. మార్చి 27 న పృథ్వీ రాజ్-మోహన్ లాల్ ల L2 చిత్రం విడుదల కాబోతుంది. ఇలాంటి సమయంలో పృథ్వీ రాజ్ సుకుమారన్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది.
పృథ్వీ రాజ్ సూపర్ స్టార్ ని కలిసిన విషయాన్ని ఓ పిక్ తో షేర్ చేస్తూ రజిని సర్ కి L2 ఎంపురాన్ ట్రైలర్ ను అందరికంటే ముందు చూపించడం జరిగింది. ఆయన ట్రైలర్ చూసాక నాతో అన్నమాటలు ఎప్పటికి మర్చిపోలేను, ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను, సూపర్ స్టార్ తో ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ.. ఎప్పటికి రజిని సర్ కి నేను వీరాభిమానినే అంటూ రజినీతో కలిసి దిగిన పిక్ ని పృథ్వీ రాజ్ సుకుమారన్ షేర్ చేసారు.
ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా పృథ్వీ రాజ్ చెప్పారు. ప్రస్తుతం పృథ్వీ రాజ్ మహేష్ మూవీలో నటిస్తున్నారు, రాజమౌళి దర్శకత్వంలో పృథ్వీ రాజ్ మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.