నటుడు పోసాని కృష్ణ మురళీకి భారీ ఊరట లభించింది. ప్రస్తుతం ఏపీ పోలిసుల అదుపులో ఉన్న పోసాని కి కడప మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఏపీ లో ఆయనపై నమోదు అయిన పలు కేసుల్లో పోసాని రోజుకో జైలుకి మారారు.
పోసాని కృష్ణ మురళిని కస్డడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.