శోభిత ధూళిపాళ్ల తన భర్త నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. తండేల్ సినిమా విజయం తర్వాత చైతూ విరామం తీసుకుని తన భార్యతో ప్రయాణం చేస్తున్నాడు. ఈ సందర్భంగా శోభిత తన వెకేషన్ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అవి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ జంట నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డ్యామ్‌లో ఉంది. శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో “Vibes” అంటూ క్యాప్షన్ ఇచ్చి పలు ఫోటోలు షేర్ చేసింది. అందులో చైతూ శోభిత కలిసి దిగిన సెల్ఫీ, బ్రేక్‌ఫాస్ట్ ఫోటో, మెహందీ వేసుకున్న తన చేతి చిత్రం, లైవ్ రెజ్లింగ్ మ్యాచ్ చూస్తున్న వీడియో ఉన్నాయి. ఫుడ్ లవర్స్‌కి ఉల్లిపాయ సమోసాల ఫోటో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
నాగ చైతన్య, శోభిత 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందే వీరి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది. పెళ్లి తర్వాత వీరు ఎన్నో కార్యక్రమాల్లో కలిసి కనిపించారు.
ఇక చైతూ నటించిన తండేల్ సినిమా మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.