నిహారిక కొణిదెల తన భర్త చైతన్యతో విడిపోవడం అందరికీ తెలిసిందే. వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ జంట విడిపోయింది. ప్రస్తుతం నిహారిక పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. నిర్మాతగా, నటిగా తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిహారిక తన విడాకుల గురించి స్పందించింది. సెలబ్రిటీ అయినా కానీ ఏ మహిళకైనా ఈ అనుభవం తలనొప్పే అని అంగీకరించింది. పెళ్లికి ముందు ఎవరూ విడాకుల గురించి ఆలోచించరు. కానీ కొన్ని పరిస్థితులు అనుకున్నట్లుగా ఉండవు. కొన్ని సార్లు ఎదుర్కొనే పరిస్థితులు అదుపు తప్పుతాయి. అలాంటి సమయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని తెలిపింది.
జీవితంలోని ప్రతి ఒడిదుడుకుల నుంచీ ఏదైనా నేర్చుకోవచ్చని నిహారిక అభిప్రాయపడింది. విడాకుల అనంతరం పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను రూపొందించింది. తమిళంలో విడుదలైన మద్రాస్కారన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాలో గ్లామరస్ పాత్రలో నిహారిక కొత్తగా మెరవనుందని సమాచారం.