Advertisementt

శ్రీలీల తర్వాత ఈ అమ్మాయే: అల్లు అర్జున్

Fri 21st Jul 2023 11:44 AM
allu arjun  శ్రీలీల తర్వాత ఈ అమ్మాయే: అల్లు అర్జున్
Allu Arjun Full Speech at Baby Movie Appreciation Meet శ్రీలీల తర్వాత ఈ అమ్మాయే: అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్చారు. ఆయన బర్త్ డే తర్వాత అల్లు అర్జున్ బయట అంతగా కనిపించలేదు. ఏదో ఎయిర్ పోర్ట్ లోనో లేదంటే ఇంకెక్కడన్నా కనిపించినా.. ఓ ఈవెంట్ లో కనిపించింది మాత్రం నిన్న రాత్రి బేబీ మూవీ అప్రిసేషన్ మీట్లోనే. స్టైలిష్ ఎంట్రీతో అల్లు అర్జున్ బేబీ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. ముఖ్యంగా తెలుగమ్మాయిలు సినిమాల్లోకి ఎందుకు రావడంలేదో అంటూ అల్లు అర్జున్ చాలా బాధపడిపోయాడు. తాను మొన్నామధ్యన ఓ అవార్డు వేడుకకి హాజరు కాగా.. ఆ వేడుకలో కన్నడ అమ్మాయిలు, తమిళ అమ్మాయిలు, మలయాళీ అమ్మాయిలు స్టేజ్ మీదకి వస్తూ అవార్డ్స్ అందుకుని మాతృ భాషలో మాట్లాడారు.

కానీ నాకు ఒక్క తెలుగమ్మాయి కూడా కనిపించలేదు. నాకు ఇది అనిపించి కూడా ఏడెనిమిది ఏళ్ళు అవుతుంది. అసలు తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చేందుకు ఎందుకు భయపడుతున్నారు. రండి.. అమ్మాయిలు ఇంత మంచి ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు అందుకోండి.. నేను ముఖ్యంగా ఈ ఈవెంట్ కి రావడానికి కారణం వైష్ణవి చైతన్యనే. సాయి రాజేష్, SKN వీళ్ళ గురించి వచ్చింది 50 పర్సెంట్ అయితే నేను వచ్చింది హీరోయిన్ వైష్ణవి కోసమే. ఆ అమ్మాయి అల వైకుంఠపురములో నా సిస్టర్ కేరెక్టర్ చేసింది. అప్పుడు తన పని తాను చేసుకుని నీట్ గా వెళ్ళిపోయింది.

కానీ ఇప్పుడు ఓ ఫుల్ మూవీలో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం శ్రీలీల వచ్చి వరసగా సినిమాలు చేస్తుంది, ఇప్పడు వైష్ణవి హీరోయిన్ గా మారింది.. తెలుగమ్మాయిలు సినిమాల్లోకి రావాలి.. ఇలా తెలుగు నుండి కూడా అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చి టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనేది నా కోరిక అంటూ అల్లు అర్జున్ ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. 

Allu Arjun Full Speech at Baby Movie Appreciation Meet:

Baby Movie Appreciation Meet Highlights

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ