ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bookings started dull even in the weekend

వీకెండ్ లో కూడా డల్ గా మొదలైన బుకింగ్స్

నాగ చైతన్య టైం బాగోలేదో .. లేదా ప్రేక్షకుల తీరు మారిందో కానీ.. నాగ చైతన్య రీసెంట్ గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్యూ మూవీ నిన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. శుక్రవారం సినిమా టాక్ బయటికి రాకముందు జోరుగా టికెట్ బుకింగ్స్ జరగాల్సింది.. కనీసం 20 శాతం ఆక్యుపెన్సీ కూడా థియేటర్స్ లో కనిపించలేదు. మరి భారీ వర్షాల వలనో.. లేదంటే థాంక్యూ మూవీ పై ఉన్న అపనమ్మకమో.. కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్స్ దగ్గర సందడి చేసిన ఆనవాలు లేదు. ఇక థాంక్యూ మూవీ టాక్ బయటికి వచ్చాక ఆ బుకింగ్స్ మరింతగా పడిపోయాయి.

థాంక్యూ సినిమాకి కనీసం మిక్స్డ్ టాక్ కూడా రాకపోయేసరికి ఆడియన్స్ కూడా సినిమాకి వెళ్లాలనే కోరికని వదిలేసారు. అసలే అకాల వర్షాలు, హైదరాబాద్ లో వరదలు, హిట్ సినిమా అయితే తెగించి బయటికి వెళ్లినా ఓకె.. కానీ ఫట్ సినిమాకి సాహసం చేసి థియేటర్స్ కి వెళ్లే ఆలోచనలు పెట్టుకోవడంలేదు. దానితో థాంక్యూ బుకింగ్స్ శనివారం డల్ గా కనిపించాయి. మరి ఆదివారం అయినా థాంక్యూ కి ప్రేక్షకులు వస్తారో.. రారో.. అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 

Thank You movie release on July 22nd

Bookings started dull even in the weekend
thank you
thank you movie colelctions
vikram k kumar
naga chaitanya