Advertisementt

హంసా నందిని హెల్త్ అప్ డేట్

Thu 24th Feb 2022 06:18 PM
hamsa nandini,cancer,chemo survivor,hamsa nandini health update  హంసా నందిని హెల్త్ అప్ డేట్
Hamsa Nandini health Update హంసా నందిని హెల్త్ అప్ డేట్
Advertisement
Ads by CJ

హీరోయిన్ గాను, మిర్చి, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తానేమిటో ప్రూవ్ చేసుకున్న హంస నందిని గత ఏడాది తనకి క్యాన్సర్ సోకినట్టుగా చెప్పి అందరికి షాకిచ్చింది. గతంలో హంస నందిని తల్లి బ్రెస్ట్ క్యాన్సర్ తోనే కన్ను మూసారు. ఇప్పుడు హంస కూడా బ్రెస్ట్ కేన్సర్ బారిన పడినట్టు గా చెప్పేసరికి ఆమె ఫాన్స్ బాగా ఫీలయ్యారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నాను అని చెప్పిన హంస నందిని మరోసారి తన హెల్త్ అప్ డేట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స పూర్తయ్యింది అని చెప్పింది హంస నందిని.

తనకి16సైకిల్స్‌ పాటు కీమో థెరపీ చేశారు అని.. ఇప్పుడు నేను అధికారికంగా కీమో థెరపీ నుంచి కోలుకున్నాను. అయితే చికిత్స ఇంకా పూర్తి కాలేదు. నేను ఇంకా క్యాన్సర్ ని జయించలేదు. తదుపరి పోరాటానికి నేను సన్నద్దం కావాల్సిన తరుణం ఇది. సర్జరీలకు సమయం ఆసన్నమైంది అంటూ ఇన్‌స్టాలో ఓ ఫోటోను షేర్‌ చేసింది. ఆ పిక్ లో హంస నందిని వెనుదిరిగి కనిపిస్తున్నా.. ఆమె హెయిర్ మొత్తం ఊడిపోయినట్లుగా ఆ పిక్ లో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె ఫాన్స్, నెటిజెన్స్ కోరుకుంటున్నారు.

Hamsa Nandini health Update:

Hamsa Nandini opens up about cancer: I am officially a chemo survivor

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ