Advertisement

పవన్ - ఆర్జీవీ ఇద్దరి పధ్ధతి ఒకటే.!

Mon 21st Feb 2022 10:56 AM
comparison between pawan kalyan and ram gopal varma  పవన్ - ఆర్జీవీ ఇద్దరి పధ్ధతి ఒకటే.!
Pawan - RGV Both methods are the same.! పవన్ - ఆర్జీవీ ఇద్దరి పధ్ధతి ఒకటే.!
Advertisement

పవన్ కళ్యాణ్ పై తరచుగా తల తిక్క ట్వీట్స్ వేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్సుని కవ్విస్తుంటారు రామ్ గోపాల్ వర్మ. పొద్దున్నే లేచి పోర్న్ చూస్తా అనేవాడి గురించి ఏం మాట్లాడతాంలే అంటూ ఆర్జీవీ వ్యాఖ్యల్ని చాలా తేలిగ్గా కొట్టి పడేసారు పవన్ కళ్యాణ్. దాంతో ఇంకా రెచ్చిపోయిన రాము పవన్ పై ఏకంగా ఓ సెటైరికల్ సినిమాని తీసి పడేసారు. మరికొన్ని రాజకీయ నేపథ్య చిత్రాల్లో జనసేనానిని కమెడియన్ ని చేసి పడేసారు. ఆఫ్ కోర్స్.. ఇప్పటికీ ఏదో రకంగా ఆర్జీవీ కెలుకుడు కొనసాగుతూనే ఉందనుకోండి. అదంతా పక్కనపెట్టి అసలు విషయానికి వస్తే...

మరో ఐదు రోజుల్లో తన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ పెట్టుకుని కూడా నిన్న నరసాపురంలో జరిగిన మత్స్యకారుల సభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేనాని. అయితే ఆ విమర్శలు భీమ్లాకి ఎఫెక్ట్ అవుతాయేమో అని కంగారు పడుతున్నారు వకీల్ నాటి షాక్ చవి చూసిన అభిమానులు. కానీ జనరల్ పీపుల్ మాత్రం పవన్ గట్స్ ని ప్రశంసిస్తూ ఇపుడు ప్రభుత్వం ఏం ప్రతీకార చర్యలు చేపడుతుందా అనే ఆసక్తిని కనబరుస్తున్నారట. 

రాజకీయాలతో సినిమాని ముడిపెట్టలేను. జనానికి నచ్చితే సినిమా చూస్తారు.. లేకుంటే లేదు అంటూ గతంలోనే చాలాసార్లు చెప్పిన పవన్ నిన్నటి స్పీచ్ లోను అదే తీరుని చూపించారు. సరిగ్గా ఆర్జీవీ పద్ధతి కూడా ఇదేనంటూ నిన్న రాత్రినుంచీ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుండడం విశేషం. ఓ విధంగా అదీ నిజమే. ఎప్పుడు ఎలాంటి కథని ఎంచుకున్నా, ఎంతటి వివాదాన్ని రగిలించినా ఫైనల్ గా ఆర్జీవీ కూడా సినిమా నచ్చితే చూడండి.. లేకుంటే మానెయ్యండి. నా తీరు మాత్రం మార్చుకునే ప్రసక్తే లేదు అంటుంటారు. మొత్తానికి భిన్న ధృవాలైన పవన్ - ఆర్జీవీల పధ్ధతి ఈ ఒక్క విషయంలో కాస్త కలిసిందన్న మాట. 

అన్నట్టు.. టికెట్ రేట్స్ వ్యవహారంలో కూడా అడుక్కునే అవసరం ఏంటి.. మన హక్కుని పోరాడి సాధించుకోవాలి కానీ అంటూ ఒకే స్వరం వినిపించారు పవన్ - ఆర్జీవీ.!

Pawan - RGV Both methods are the same.!:

Pawan RGV voice & response was the same in those matters

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement