Advertisementt

శకుంతలగా సమంత స్టన్నింగ్ లుక్

Mon 21st Feb 2022 09:58 AM
samantha shakunthalam movie first look  శకుంతలగా సమంత స్టన్నింగ్ లుక్
Samantha Stunning Look As Shakunthala శకుంతలగా సమంత స్టన్నింగ్ లుక్
Advertisement

ఓవైపు తన గ్లామర్ తో కుర్రకారుని ఊఁ అనిపిస్తూనే మరోవైపు పెరఫార్మెర్ గా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టేక్కేస్తూ వస్తోంది సమంత. లాస్ట్ ఇయర్ ది ఫామిలీ మ్యాన్ సీజన్ 2 లో అద్భుతంగా నటించి పుష్పలో ఆకర్షణీయంగా నర్తించి శహభాష్ అనిపించుకున్న సమంత త్వరలో శకుంతలగా తన నటనా పటిమను చూపేందుకు సిద్ధమవుతోంది. 

సమంత టైటిల్ రోల్ లో గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న శాకుంతలం చిత్రం ఫస్ట్ లుక్ ని నేటి ఉదయం విడుదల చేయగా.. శకుంతలగా సమంత స్టన్నింగ్ లుక్ విత్ ఇన్ సెకండ్స్ లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం స్టార్ట్ అయిపోయింది. కథకి తగ్గట్టు కుదిరిపోయి.. పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయే సమంత చారిత్రాత్మక గాథ శాకుంతలంలోనూ అదే ప్రత్యేకత ప్రదర్శించనుందని ఈ ఫస్ట్ లుక్ పోస్టరే ప్రూవ్ చేసేస్తోంది. 

రుద్రమదేవి తరువాత మళ్ళీ శాకుంతలం రూపంలో మరో భారీ ప్రాజెక్ట్ చేపట్టిన గుణశేఖర్ ఈ ప్రెస్టీజియస్ మూవీని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా ఫిలింగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ శాకుంతలం చిత్రానికి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Samantha Stunning Look As Shakunthala:

Samantha - Guna Shekhar Shakunthalam Film First Look

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement