Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ashu reddy Confirmed for Bigg Boss OTT?

అషు బిగ్ బాస్ ఎంట్రీ.. అలా కన్ ఫర్మ్ చేసారా

Ashu reddy Confirmed for Bigg Boss OTT?

బిగ్ బాస్ తెలుగు ఓటిటి మొదలు కావడానికి కౌన్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 26 న గ్రాండ్ గా సరికొత్త హంగులతో ఎంతో ప్రయోగాత్మకంగా బిగ్ బాస్ ఓటిటి హాట్ స్టార్ లో మొదలవుతుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా రాబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఓటిటి ప్రోమో అందరిలో ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేసింది. అయితే బిగ్ బాస్ ఓటిటిలోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ చాలామంది వెళ్ళబోతున్నారు. వీళ్ళకి భారీ పారితోషకాలు ఇచ్చి మరీ బిగ్ బాస్ లోకి పంపుతున్నారని తెలుస్తుంది. 85 రోజుల పాటు సాగే బిగ్ బాస్ ఓటిటిలోకి ఈసారి కూడా 18 మంది ఎంట్రీ ఉండబోతుంది. అందులో చాలామంది మాజీ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారని.. ఇప్పటికే హౌస్ లోకి అడుగుపెట్టే వారు క్వారంటైన్ కి వెళ్లారని టాక్.

ముమైత్, తేజస్వి, అషు రెడ్డి, అరియనా, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్ లాంటి వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారని అంటున్నారు. అందులో అషు రెడ్డి యాంకర్ గా హ్యాపీ డేస్, స్టార్ మా కామెడీ స్టార్స్ అంటూ హంగామా చేస్తుంది. అలాంటి ఆశు వెళ్ళలేదేమో.. బిగ్ బాస్ కి ఆమె వెళుతుంది అనేది జస్ట్ ప్రచారమేమో అనుకుంటే.. అషు రెడ్డి ఫ్రెండ్ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం.. ఆల్ ది బెస్ట్ అషు.. ఎందుకు చెప్పానో నువ్వే ఆలోచించుకో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బిగ్ బాస్ షోలోకి వెళ్తుందని పరోక్షంగా చెప్పాడు. దానితో అషు రెడ్డి నువ్వు ఎల్లప్పుడూ నా మంచి కోరుకునే వ్యక్తివి కాబట్టి.. నన్ను విష్ చేశావేమో.. అంటూ ఆ విషయాన్ని తెలివిగా కవర్ చేసింది. 

Ashu Reddy to step in Bigg Boss Nonstop

bigg boss
bigg boss ott telugu
hot star
ashu reddy
rahul sipliganj
bigg boss nonstop