Advertisement

బిగ్ బాస్ 5: ఫైనల్ గెస్ట్ ఎవరు బాస్

Sun 19th Dec 2021 09:22 PM
bigg boss telugu 5,bigg boss 5,bugg boss grand finale episode,nagarjuna,naga chaitanya,alia bhatt,ranbir kapoor,rashmika,sukumar,nani,sai pallvi,krithi shetty  బిగ్ బాస్ 5: ఫైనల్ గెస్ట్ ఎవరు బాస్
Bigg Boss 5: Who is the final guest బిగ్ బాస్ 5: ఫైనల్ గెస్ట్ ఎవరు బాస్
Advertisement

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్టార్ మా ఈ రోజు ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. బాలీవుడ్ తారాగణం, టాప్ స్టార్స్ అలియా భట్, రణబీర్ కపూర్ లు బిగ్ బాస్ స్టేజ్ పై గ్రాండ్ అతిధులుగా బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ దర్శక ధీరుడు రాజమౌళి తో పాటుగా జగపతి బాబు గెస్ట్ లుగా సందడి చేసారు. ఇక పుష్ప సుకుమార్, రష్మిక, దేవిశ్రీలు సామి సామి అంటూ బిగ్ బాస్ స్టేజ్ పై ఊపేసారు. రష్మిక సిరిని ఎలిమినేట్ చేసి హౌస్ నుండి బయటికి తీసుకువచ్చేసింది. తర్వాత స్టేజ్ పైకి ఎంటర్ అయిన నాని శ్యామ్ సింగరాయ్ టీం మరింతగా ఎంటర్టైన్ చేసింది. 

నాని, సాయి పల్లవి, కృతి శెట్టి లు స్టేజ్ పైనే కాదు.. హౌస్ లోకి సూట్ కేస్ తో వెళ్లి ఉన్న నలుగురిని ఎవరికి ఈ సూట్ కేస్ కావాలని నాని అడిగినా.. షణ్ముఖ్, సన్నీ, మానస్, శ్రీరామ్ లు టెంప్ట్ అవ్వలేదు. అయితే నలుగురిలో నాని మానస్ ని ఎలిమినేట్ చెయ్యగా.. సాయి పల్లవి, కృతి శెట్టిలు మానస్ ని తీసుకెళ్లారు.

ఇక తర్వాత నాగ చైతన్య బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంటర్ అయ్యి.. వివో ప్రో కబాడీ ని ప్రమోట్ చేసాడు. ఆ తర్వాత టాప్ 3 నుండి ఒకరిని ఎలిమినేట్ చెయ్యబోతున్నాడు. అలాగే నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ఏవి ని చూపించాడు. మరి ఎంతమంది గెస్ట్ లు వస్తున్నా బిగ్ బాస్ సీజన్ 5 కి ఫైనల్ గెస్ట్ ఎవరో? ఏ గెస్ట్ బిగ్ బాస్ విన్నర్ కి ట్రోఫీ అందిస్తారో అనే క్యూరియాసిటిలో బిగ్ బాస్ ప్రేక్షకులు ఉన్నారు. మరి ఆ ఫైనల్ గెస్ట్ ఎవరో ఈ రోజు నైట్ 10 గంటల వరకు సస్పెన్స్ లోనే ఉండేటట్లు ఉంది. 

Bigg Boss 5: Who is the final guest:

Bigg Boss Telugu 5: Grand Finale Episode Update

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement