బిగ్ బాస్ 5: ఈ వారం నామినేషన్స్ లో

ఆదివారం ఫండే సండే.. అయ్యింది. నాగార్జున దివాళి బిగ్ బాస్ ఎపిసోడ్ ముగిసింది. మళ్లీ సోమవారం నామినేషన్స్ డే. మిత్రులు శత్రువులుగా మారిపోయి ఒకరినొకరు నామినేట్ చేసుకునే రోజు. అలాగే హౌస్ లో గొడవలకు ఈ నామినేషన్స్ ఆద్యం పోస్తాయి. ఎనిమిదో వారంలో లోబో ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్స్ విషయంలోనూ బాగా గొడవలే అయ్యాయి. మానస్ vs శ్రీరామ్ చంద్ర, సన్నీ vs సిరి, రవి vs మానస్ ల మధ్యన నామినేషన్స్ ఫైటింగ్ బాగానే అయ్యింది. మానస్ శ్రీరామ్ ని నామినేట్ చేస్తూ.. ప్రతీ వారం ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోతారు. కాబట్టి నీవు ఇంటి నుంచి వెళ్లిపోయినా ఫరక్ పడదు అని అంటే.. దానికి శ్రీరామ్ చంద్ర కూడా నీవు ఉన్నా ఇంటిలో ఏ మాత్రం ఫరక్ ఉండదు అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక మొహం మీద పేస్ట్ రాస్తూ నామినేట్ చెయ్యాల్సి ఉంది. సిరి ఇంటిలో జరిగే టాస్క్ విషయంలో ఎవరైనా, ఎంతైనా అనుకోవచ్చు. కానీ హెల్త్ విషయాన్ని పాయింట్ అవుట్ చేయడం నాకు చాలా బాధగా ఉంది. నీ నుంచి అలాంటి మాటలు రావడం నాకు నచ్చలేదు అంటూ సన్నీ పై ఫైర్ అయ్యింది సిరి. అంతేకాకుండా యాంకర్ రవి - మానస్ మధ్యన కూడా గట్టిగానే గొడవ జరిగింది. ఇక ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా షణ్ముఖ్ తప్ప ఆల్మోస్ట్ అందరూ నామినేట్ అయ్యారు. అనీ మాస్టర్, జస్వంత్, కాజల్, విశ్వ, మానస్, ప్రియాంక, యాంకర్ రవి, సిరి , శ్రీరామచంద్ర, సన్నీ నామినేట్ అయ్యారు. కేవలం కెప్టెన్ కావడంతో షణ్ముఖ్ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యాడు లేదంటే మనోడే ముందుండేవాడు.

Bigg Boss 5: 9th Week Nominations list

Bigg Boss 5: 9th Week Nominations
bigg boss 5
bigg boss telugu
bigg boss
9th week nominations list