బిగ్ బాస్ 5: హౌస్ మేట్స్ ఆకలి కేకలు

బిగ్ బాస్ సీజన్ 5 అప్పుడే మూడు వారలు గడిచిపోయి.. నాలుగో వారం పూర్తి చేసుకోబోతుంది. మూడు వారాల్లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఈ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం దాదాపుగా 7 గురు నామినేషన్స్ లో ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ పెట్టి.. అందులో బిగ్ బాస్ హౌస్ లోని ఫుడ్ మొత్తం.. దొంగలు ఎత్తుకుపోయేలా ప్లాన్ చేసారు. దానితో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఆహార పదార్ధాన్ని దొంగలు పట్టుకెళ్ళిపోయారు. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే బిగ్ బాస్ ఫుడ్ పంపుతుంది. 

అదే టైం లో లోబో దొంగతనంగా ఫుడ్ తిన్నందుకు గాను కెప్టెన్ జెస్సిని బిగ్ బాస్ మందలించాడు. దానితో ఈ రోజు ప్రమోలో జెస్సి బాగా ఫీలవుతున్నాడు. ఇక జెస్సి ఫ్రెండ్ షణ్ముఖ్ ఈ హౌస్ లో అందరూ ఒక్కటే.. ఎవరిని అన్నా అని పిలవక్కర్లేదు.. పేరు పెట్టి పిలువ్ అంటూ సజెషన్ ఇచ్చాడు. ఇక హౌస్ మేట్స్ అంతా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్న టైం లో ప్రియాంకకి బిగ్ బాస్ చికెన్ లెగ్ పీస్ లు పంపారు. ఇక రవి, మిగతా హౌస్ మేట్స్ డల్ గా ఫుడ్ వాల్యూ అంటే బిగ్ బాస్ ద్వారా తెలిసింది అనుకుంటూ ఉండగా.. లోబో ఆకలి మంట తట్టుకోలేక.. చెత్త బుట్టలో తడుముతున్న ఎపిసోడ్ ఈ రోజు రాత్రి రాబోతుంది. ప్రస్తుతం స్టార్ మా ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో వదలగా అందులో కంటెస్టెంట్స్ ఆకలి కేకలు కనిపిస్తున్నాయి. 

Bigg Boss 5 telugu new Promo viral

Bigg Boss 5: latest Promo viral
bigg boss 5
bigg boss 5 telugu
bigg boss