ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nagababu comments on Sai Dharam Tej health

సాయిధరమ్‌ హెల్త్ అప్ డేట్ ఇచ్చిన నాగబాబు

వినాయక చవితి రోజున బైక్ యాక్సిడెంట్ అయ్యి.. కోమాలోకి వెళ్ళిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. కొన్నాళ్లుగా అపోలో హాస్పిటల్ లోనే డాక్టర్స్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత ప్రతి రోజు సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్ డేట్ ఇచ్చేవారు డాక్టర్స్. కానీ గత వారం రోజులుగా సాయి ధరమ్ హెల్త్ కండిషన్ పై డాక్టర్స్ అప్ డేట్ ఇవ్వకపోవడం, పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ఈవెంట్ లో సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని చెప్పడంతో ఆయన ఫాన్స్ లో ఆందోళ మొదలైంది. అసలు సాయి ధరమ్ కోలుకుంటున్నాడా? ఇంకా కోమాలోనే ఉన్నాడా? అసలు ఆయనకి ఏమైంది అంటూ సాయి ధరమ్ ఫాన్స్ రకరకాల అనుమాలతో ఉన్నారు.

అయితే తాజాగా నాగబాబు అభిమానులతో చిట్ చాట్ చెయ్యగా.. ఫాన్స్ సాయి ధరమ్ ఆరోగ్యం గురించి అడిగారు. సాయి ధరమ్ ఎలా ఉన్నాడు అని, దానితో నాగబాబు సాయితేజ్‌ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. అతి త్వరలోనే సాయి తేజ్ మన ముందుకు వస్తాడు.. అంటూ హెల్త్ అప్ డేట్ ఇవ్వగానే సాయి ధరమ్ తేజ్ ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాయి తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ రేపు శుక్రవారమే రిలీజ్ అవుతుంది. మరి ప్రమోషన్స్ కోసమైనా సాయి తేజ్ తో ఈ సినిమా పై ఓ వీడియో బైట్ ఇస్తే.. బావుంటుంది కదా అని ఫాన్స్ అడుగుతున్నారు. మరి ఈ రెండు రోజుల్లో ఎమన్నా సాయి తేజ్ నుండి అప్ డేట్ వస్తుందేమో చూడాలి. .

Sai Dharam Tej health update

Nagababu comments on Sai Dharam Tej health
sai dharam tej
nagababu
republic
sai tej health update