Advertisement

ఆర్.ఆర్.ఆర్ ని బీట్ చేస్తుందా

Fri 06th Aug 2021 09:18 PM
pushpa pan india films,rrr pan india movie,rajamouli,sukumar,rajamouli - sukuamr,pushpa vs rrr  ఆర్.ఆర్.ఆర్ ని బీట్ చేస్తుందా
Pushpa beats RRR ఆర్.ఆర్.ఆర్ ని బీట్ చేస్తుందా
Advertisement

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆగష్టు 1న దోస్తీ అంటూ ఫ్రెండ్ షిప్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఐదు భాషల్లో ఐదుగురు యంగ్ సింగర్స్ పాడిన ఈ సాంగ్ కి  కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ స్పెషల్ అప్పీరియన్స్ అదిరిపోయెలా అనిపించింది. అయితే ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ పుష్ప కూడా ఆర్.ఆర్.ఆర్ బాటలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఫస్ట్ సింగిల్ కోసం ఐదుగురు టాప్ మోస్ట్ సింగర్స్ ని రెడీ చేసాడు దేవి శ్రీ ప్రసాద్. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ చేత పుష్ప ఫస్ట్ సింగిల్ పాడించి దానిని ఆర్.ఆర్.ఆర్ మాదిరి వీడియో రూపంలో వదలబోతున్నారు. 

అయితే ఇప్పుడు ఆ ఫస్ట్ సింగల్ కోసం ఏకంగా 2 కోట్లు ఖర్చు పెట్టారట మేకర్స్. 2 కోట్లు బడ్జెట్ పెట్టి సాంగ్ ని చిత్రీకరించిన ఆ సాంగ్ పుష్ప లో స్పెషల్ గా ఉండబోతుంది అని అంటున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్.. పుష్ప సాంగ్ కి వస్తుందా? అసలు పుష్ప ఆర్.ఆర్..ఆర్ ని బీట్ చేయగలదా? ఆర్.ఆర్.ఆర్ మల్టీస్టారర్ మూవీ. అందులోను రాజమౌళి కి భీభత్సమైన క్రేజ్ ఉంది. అలాంటప్పుడు పుష్ప అసలు ఆర్.ఆర్.ఆర్ ముందు నిలవగలదా అంటున్నారు నెటిజెన్స్. 

Pushpa beats RRR:

Pushpa vs RRR

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement