ఏదైనా స్పెషల్ గా ఉండాల్సిందే

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. ప్రస్తుతం హీరోల ఇద్దరిపై సాంగ్ చిత్రీకరణ చేపట్టారు. అలియా భట్ రామ్ చరణ్ కి జోడిగా, ఎన్టీఆర్ కి హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా నటిస్తుండగా.. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టింది టీం. రేపు ఉదయం RoarOfRRR ని వదలబోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్.ఆర్.ఆర్ ట్రెండ్ అవుతుంది. 

ఇక తాజాగా ఆర్.ఆర్.ఆర్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే ఆర్.ఆర్.ఆర్ లో ఇప్పుడు చిత్రీకరిస్తున్న సాంగ్ విలువ ఏకంగా మూడు కోట్లట. ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సాంగ్ రూపుదిద్దుకోనుందట. కేవలం ఆ ఒక్క పాట కోసం ఏకంగా 3కోట్లు ఖర్చు పెడుతున్నారట నిర్మాతలు. జక్కన్న బడ్జెట్ కోసం ఆలోచించడు. ఏదైనా స్పెషల్ గా ఉండాలి అంటే ఉండాల్సిందే. అందుకే నిర్మాతలు కూడా జక్కన్న అడిగింది కాదనకుండా ఇచ్చేస్తారు. అయితే ఈ సాంగ్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ ఖర్చే హాట్ టాపిక్ గా మారింది. 

Rajamouli RRR update

Interesting update on RRR
rrr pan india movie
ntr with ram charan
ram charan as alluri sita ramaraju
komaram bheem as ntr
rajamouli
jakkanna
ntr rrr movie
ram charan rrr movie
rajamouli rrr
d.v.v danayya
dvv entertainment
alia bhatt
ajay devagan