ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dhanush and Sai Pallavi Rowdy Baby hits 5 million likes on YouTube

ధనుష్-సాయి పల్లవి మరోసారి ఇరగదీసారు

ధనుష్ - సాయి పల్లవి కలిసి కోలీవుడ్ డిజాస్టర్ సినిమా మారి 2 లో నటించారు. సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. కానీ అనుకున్న రేంజ్ హిట్ అయితే సినిమా తీసుకురాలేకపోయింది. అయినా ఆ సినిమాలో ధనుష్ - సాయి పల్లవి పెయిర్ కి మంచి పేరొచ్చింది. అంతేకాదు.. ఆ సినిమా ఓ సాంగ్ ఇప్పటికి యూట్యూబ్లో దుమ్మురేపుతూనే ఉంది. అదే రౌడీ బేబీ సాంగ్, ప్రతి ఒక్కరి ఆల్బమ్ లో ఉండే ఈ రౌడీ బేబీ సాంగ్ సృష్టించని రికార్డు లేదు. 

తాజాగా రౌడీ బేబీ మరో రికార్డు కొల్లగొట్టింది. ఇండియాలో ఎప్పుడో బిలియన్ వ్యూవ్స్ మార్క్ ను టచ్ చేసిన టాప్ సాంగ్స్ లో ఒకటిగా రౌడి బేబి రికార్డు సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ రౌడీ బేబీ సాంగ్ సౌత్ ఇండియాలో అత్యదిక లైక్స్ అందుకున్న పాటగా రికార్డును అందుకుంది. 5 మిలియన్స్ లైక్స్ అందుకుని.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ సాంగ్ లో సాయి పల్లవి కాస్ట్యూమ్స్, ధనుష్ కాస్ట్యూమ్స్, సాయి పల్లవి లవ్లీ స్టెప్స్, ధనుష్ మాచింగ్ స్టెప్స్ అన్ని యూత్ ని ఉర్రుతలూగించాయి. 

Maari 2 Rowdy Baby hits 5 million likes on YouTube

Dhanush and Sai Pallavi Rowdy Baby hits 5 million likes on YouTube
dhanush
sai pallavi
rowdy baby hits
5 million likes
youtube
dhanush and sai pallavi
maari 2 movie
rowdy baby song