ఏపీలో కర్ఫ్యూ.. కేసీఆర్ బాటలో జగన్

ఏపీలో మే 3 నుండి కరోనా కర్ఫ్యూ ని అమలు చేస్తుంది జగన్ ప్రభుత్వం. ఏపీలో కరోనా భీబత్సం ఎక్కువగా ఉండడంతో జగన్ సర్కార్ 18 గంటల కర్ఫ్యూ అమలు చేస్తుంది. అప్పటినుండి పది రోజులకొకసారి కర్ఫ్యూ పొడిగిస్తూ.. జూన్ పది వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటున్నట్లుగా ప్రకటించింది. ఉదయం ఆరు గంటల నుండి మద్యాన్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు సమయం ఇచ్చింది. 12 తర్వాత అత్యవసర సేవల మినహా అన్ని బంద్ అయ్యాయి. అయితే తాజాగా జగన్ సర్కార్ మరోసారి కర్ఫ్యూని పొడిగించింది. జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు.

జూన్ 20 వరకు మధ్యాన్నం 2 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది అని, 12 గంటల నుండి 2 గంటల సమయం పెంచి ఆంక్షలు సడలింపు చేసినట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడిగించి ఆంక్షలు సమయాన్ని పెంచారు. మొన్నటివరకు ఉదయం పది గంటల వరకే ఆంక్షల సడలింపు ఉంది. ఈ సడలింపు సమయంలో 2 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఇక జూన్ 9 తో తెలంగాణలో లాక్ డౌన్ సమయం ముగుస్తుంది. రేపు కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ పొడిగింపా? లేదంటే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారో? అనేది ప్రకటించబోతుంది కేసీఆర్ ప్రభుత్వం. 

ఇక జగన్ ప్రభుత్వం ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 20 వరకు కర్ఫ్యూ పెట్టినా.. సడలింపు సమయం పెంచినట్లుగా కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.

Andhra Pradesh curfew extension till June 20th

Andhra Pradesh curfew extension
andhra pradesh
curfew extension
jagan government
june 20th
kcr
jagan
cm jagan