పవన్- పూరీ కాంబినేషన్ రిపీట్ కానుందా..?

Pawan, Puri combo repeat again..?Pawan, Puri combo repeat again..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా ఇంకా సెట్స్ మీదే ఉంది. ఐతే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ మరో నాలుగైదు సినిమాలని లైన్లో పెట్టాడు. అధికారికంగా హరీష్ శంకర్ సినిమాతో పాటు క్రిష్ సినిమా ప్రకటన వచ్చింది. ఐతే  ఆ తర్వాత కూడా సినిమాలున్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో పూరీ జగన్నాథ్ దర్శకుడిగా మారాడు. బద్రి సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ప్రయాణం అందరికీ తెలిసిందే. ఐతే ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాతో మరోసారి రిపీట్ అయ్యింది. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు.

తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ రాబోతుందని వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి సరిపోయే స్క్రిప్టుని పూరీ జగన్నాథ్ రెడీ చేసాడని, బండ్ల గణేష్ నిర్మాతగా ఈ సినిమా ఉండనుందని వినబడుతుంది. ప్రస్తుతానికి ఈ విషయమై అధికారిక సమాచారం లేదు. బాస్ నాతో సినిమాకి ఒప్పుకున్నాడని బండ్ల గణేష్ ప్రకటించిన నేపథ్యంలో ఆ సినిమా పూరీ జగన్నాథ్ తోనే అయ్యుంటుందని భావిస్తున్నారు. చూడాలి మరేం జరగనుందో..!

Pawan Puri combo repeat again..?

puri jagannadh
pawan kalyan
telugu
vakeel saab