Advertisement

చిరు బర్త్‌ డే రోజున మెగా సర్ప్రైజ్ ఇదే..‌

Tue 18th Aug 2020 06:47 PM
megastar chiranjeevi,koratala shiva,ram charan,kajal agarwal,konidela productions  చిరు బర్త్‌ డే రోజున మెగా సర్ప్రైజ్ ఇదే..‌
Chiranjeevi 152 movie title unveiling on.. చిరు బర్త్‌ డే రోజున మెగా సర్ప్రైజ్ ఇదే..‌
Advertisement

సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాల ద్వారా స్టార్ స్టేటస్ దక్కించుకున్న కొరటాల శివ, మెగస్టార్ ని డైరెక్ట్ చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో సినిమాపై అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ కాలేజ్ ప్రొఫెసర్ గా కనిపిస్తారని అన్నారు.

రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్, ఆచార్య అని అనుకోకుండా బయటకి చెప్పేసాడు. అప్పటి నుండి అదే పేరు మీడియాలో ప్రస్తావిస్తూ వచ్చారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ అధికారికంగా బయటకు వెల్లడి చేసే సమయం వచ్చేసింది. 

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆగస్టు 22వ తేదీన టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తారట. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రకటించింది. మొత్తానికి మెగా అభిమానులకి చిరంజీవి పుట్టినరోజున మంచి అప్డేట్ రాబోతుంది. మరి మెగాస్టార్ నెక్స్ట్ చిత్రం గురించి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.

Chiranjeevi 152 movie title unveiling on..:

Chiranjeevi 152 movie title unveiling on..

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement