Advertisement

అడ్వెంచర్ ని సిద్ధం చేస్తున్న నిఖిల్..

Nikhil becoming writer for his next

Sat 18th Jul 2020 05:19 PM
nikhil,karthikeya2,18 pages,telugu  అడ్వెంచర్ ని సిద్ధం చేస్తున్న నిఖిల్..
Nikhil becoming writer for his next అడ్వెంచర్ ని సిద్ధం చేస్తున్న నిఖిల్..
Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, ఇటీవలే పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కరోనా టైమ్ లో ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నాడు. అయితే కరోనా రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో   కార్తికేయ 2 సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. కార్తికేయ 2 తర్వాత గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ 18పేజెస్ లో చేయనున్నాడు. 

కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ 18పేజెస్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. సుకుమార్ రాసిన కథతో తెరకెక్కనున్న ఈ సినిమా నిఖిల్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న నిఖిల్ తనలోని రైటర్ కి పని చెబుతున్నాడు.

సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న నిఖిల్, ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చాడట. కానీ నటుడిగా మారి హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం తనలోని రైటర్ ని సంతృప్తి పర్చుకోవడానికి కథలు రాస్తున్నాడట. ఈ మేరకు ఇప్పటికే ఆన్ లైన్ ఫిలిమ్ మేకింగ్ కోర్సు స్వీకరించిన నిఖిల్, స్క్రిప్టు రాస్తున్న ఫోటోని షేర్ చేసాడు. జీవితంలో కొత్త అడ్వెంచర్ రాబోతుందంటూ క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మొత్తానికి నిఖిల్ రైటర్ గా మారబోతున్నాడని తెలుస్తుంది. మరి నిఖిల్ రాసిన కథ  సినిమాగా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Nikhil becoming writer for his next:

Nikhil becoming writer for his next


Loading..
Loading..
Loading..
advertisement