ప్రభాస్ హీరోగా రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ వచ్చి పదిరోజులు కూడా కాకముందే, ప్రభాస్ 21వ చిత్రం నుండి అప్డేట్ రాబోతుంది. రాధేశ్యామ్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు, ప్రభాస్ 21 సినిమాకి అలాంటి ఎదురుచూపులేమీ లేకుండానే సర్ప్రైజ్ అందుకోబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మాతగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసిందే.
అయితే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రేపు ఉదయం 11గంటలకి ఈ సినిమా నుండి సర్ప్రైజ్ రానుందట. వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రేపటి సర్పైజ్ ఏంటో గానీ సడెన్ గా అప్డేట్ ఇస్తున్నామని చెప్పడమే సర్ప్రైజ్ గా ఉంది.




 
                     
                      
                      
                     
                     విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్ త్వరలో..!
 విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ సీక్వెల్ త్వరలో..!

 Loading..
 Loading..