‘బొంభాట్‌’ రెండో లిరికల్ సాంగ్ విడుదల

Sat 06th Jun 2020 11:27 AM
bombhaat movie,second song,lyrical song,  ‘బొంభాట్‌’ రెండో లిరికల్ సాంగ్ విడుదల
Bombhaat Movie Second Song Released ‘బొంభాట్‌’ రెండో లిరికల్ సాంగ్ విడుదల
Sponsored links

‘బొంభాట్‌’ రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ విడుద‌ల 

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ‘ఈన‌గ‌రానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్స్‌గా రాఘ‌వేంద్ర వర్మ(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో విశ్వాస్ హ‌నూర్‌క‌ర్ నిర్మిస్తున్న చిత్రం ‘బొంభాట్’. జోష్ బి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెండో లిరిక‌ల్ వీడియో సాంగ్ ‘స్వామినాథ‌’ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. 

‘‘బుద్ధిగా కలగన్నాబుజ్జిగా ఎదపైన

సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిరా

అన్నీ దిక్కులలోన ఆక్సిజన్ జడివాన ...

స్వామినాథ’’ 

అంటూ సాగే ఈ పాట హీరో హీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ లవ్ సాంగ్. ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగయ్య శాస్త్రి రాయ‌గా జోష్‌.బి సంగీతం అందించారు. చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిణి ఇవటూరి పాటను ఆలపించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Click Here for Song

Sponsored links

Bombhaat Movie Second Song Released:

Bombhaat Movie Second lyrical Song Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019