మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఏమన్నాడంటే..?

Sat 06th Jun 2020 11:45 AM
balakrishna,mokshagna,film debut,god,nandamuri fans,cine entry  మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఏమన్నాడంటే..?
Balakrishna Talks about Mokshagna Cine entry మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఏమన్నాడంటే..?
Sponsored links

బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్. కరోనా లాక్‌డౌన్‌తో ఇండస్ట్రీ పెద్దలపై బాలకృష్ణ యుద్ధం ప్రకటించడం, బాలయ్యకి వ్యతిరేకంగా కొంతమంది, కొద్దిమంది సపోర్టింగ్ గాను మాట్లాడుతుంటే.. ఇండస్ట్రీ మొత్తం వేడెక్కిపోయి ఉంది. ఈ చిచ్చు ఎప్పటికి చల్లారుతుందో తెలియదు కానీ... బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై మళ్లీ వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. బాలయ్య గత మూడేళ్ళుగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ఇదిగో అదిగో అంటూ ఊరించడమే కానీ.. అది ఎప్పుడో క్లారిటీ ఇవ్వకుండా చంపుతున్నాడు. మధ్యలో మోక్షజ్ఞ ని క్రిష్ కానీ, అనిల్ రావిపూడి కానీ లాంచ్ చెయ్యబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు.

అయితే తాజాగా బాలకృష్ణ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై మరోసారి పెదవి విప్పాడు. త్వరలోనే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుంది అని చెబుతున్నాడు. అది ఎప్పుడు అనే క్లారిటీ ఇవ్వకుండా మళ్ళీ గుంభనంగా తప్పించుకున్నాడు. అదేమిటంటే మోక్షజ్ఞ ఎంట్రీ కి ఎలాంటి ప్రత్యేక ప్లానింగ్ లేదని.. అతను ఎప్పుడంటే అప్పుడే అంటే.. దేవతలు ఎప్పుడు తధాస్తు అని దీవిస్తే అప్పుడే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేదని, మంచి మూడ్ ఉంటే.. మోక్షజ్ఞ ని తీసుకొచ్చి కెమెరా ముందు నిలబెట్టెయ్యడమే అంటూ నవ్వేస్తున్నాడు. మరి బాలయ్య చెప్పడమే కానీ... మోక్షజ్ఞ ప్రత్యేకంగా సినిమాల కోసం ఎలాంటి ఎఫర్ట్ పెట్టడం లేదనిపిస్తుంది. ఎందుకంటే మోక్షజ్ఞ విపరీతంగా బరువు పెరగడం అప్పుడప్పుడు లీకైన పిక్స్ లో చూస్తున్నాం. 

Sponsored links

Balakrishna Talks about Mokshagna Cine entry:

Balakrishna about Mokshagna Film Debut

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019