ఫోర్బ్స్ లిస్టులో ఇండియా నుండి ఒకే ఒక్కడు..

Fri 05th Jun 2020 04:04 PM
akshay kumar,forbes,laxmi bomb,raghava lawrence  ఫోర్బ్స్ లిస్టులో ఇండియా నుండి ఒకే ఒక్కడు..
Only one indian celebrity in Forbes Magazine.. ఫోర్బ్స్ లిస్టులో ఇండియా నుండి ఒకే ఒక్కడు..
Sponsored links

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ అత్యధికంగా సంపాదించిన సెలెబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో చోటు సంపాదించుకున్న ఒకే ఒక్క బాలీవుడ్ సెలెబ్రిటీ... అక్షయ్ కుమార్. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గత కొన్నేళ్లుగా ఏడాదికి మూడు సినిమాలని రిలీజ్ చేస్తూ వందలకోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఒక్క ఏడాదిలోనే 700 కోట్ల రెవెన్యూ అందించిన అక్షయ్ కుమార్, ఫోర్బ్స్  లిస్టులో 52వ స్థానాన్ని దక్కించుకున్నాడు. హాలీవుడ్ తారలైన విల్ స్మిత్, జెన్నిఫర్ ల కంటే ముందు స్థానంలో నిలవడం విశేషం.

ఖాన్ త్రయం సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి తంటాలు పడుతున్న టైమ్ లో మూడు సినిమాలని రిలీజ్ చేస్తూ మెరుగైన సక్సెస్ రేటుతో దూసుకుపోతున్నాడు. అందుకే ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన లో చోటు సంపాదించుకున్నాడు. సినిమాలతో బిజీగా ఉంటూనే బ్రాండ్లకి ప్రచారకర్తగా కొనసాగుతున్నాడు. సుమారు 20బ్రాండ్లకి ప్రచారకర్తగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్, వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. 

ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా ఓటీటీలో భారీ ధరకి అమ్ముడైపోయిందని సమాచారం. ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు.

Sponsored links

Only one indian celebrity in Forbes Magazine..:

Akshay kumar is the only one indian celebrity in Forbes list

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019