బిగ్ బాస్ 4లో యూట్యూబ్ స్టార్లు...?

Sat 30th May 2020 02:42 PM
biggboss4,nagarjuna,jahnavi darsetty,youtube,tiktok  బిగ్ బాస్ 4లో యూట్యూబ్ స్టార్లు...?
Youtube stars in Bigg boss4..? బిగ్ బాస్ 4లో యూట్యూబ్ స్టార్లు...?
Sponsored links

తెలుగు బుల్లితెరపై తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో జూన్ 15వ తేదీ నుండి సినిమా, టీవీ షూటింగులకి అనుమతి లభిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్లని సెలెక్ట్ చేసే పనిని ముమ్మరం చేసింది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తే డబ్బుతో పాటు పాపులారిటీ కూడా బాగానే వస్తుంది. సో చాలా మంది టెలివిజన్ తారలు అటువైపు వెళ్ళాలని అనుకున్నారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ తారుమారు అవడంతో టెలివిజన్ నటీనటులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఆసక్తి కనబరచడం లేదట. దాంతో బిగ్ బాస్ బృందం యూట్యూబ్ స్టార్ల మీద ఫోక పెట్టింది. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో వీడియోలు చేసే వారికి జనాల్లో పాపులారిటీ బాగా పెరిగింది. సో బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టి వీరి మీద పడింది. ఇప్పటికే మహాతల్లి ఛానెల్ లో కనిపించే జాహ్నవి దార్సెట్టిని కన్ఫర్మ్ చేసారని అంటున్నారు.

ఇక తెలంగాణ యాసలో మాట్లాడే అలేఖ్య హారికని కూడా అప్రోచ్ అయ్యారట. ఈమె దెత్తడి ఛానెల్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మిగిలిన వారిలో టిక్ టాక్ స్టార్లని కూడా తీసుకోవాలని భావిస్తున్నారట. టిక్ టాక్ లో చాలామందికి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. వారిలోంచి జనాలకి బాగా చేరువగా ఉండేవారిని తీసుకోనున్నట్టు వినబడుతుంది. మొత్తానికి బిగ్ బాస్ లో ఈ సారి కనిపించే వారందరూ డిజిటల్ స్టార్లే అన్నమాట..

Sponsored links

Youtube stars in Bigg boss4..?:

Youtube stars in Bigg boss4

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019