సూపర్ స్టార్ మహేష్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్..

Sat 30th May 2020 02:26 PM
ssmb27,maheshbabu,parashuram,mythri movie makers  సూపర్ స్టార్ మహేష్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్..
Mahesh Movie announcement సూపర్ స్టార్ మహేష్ సినిమాపై అప్డేట్ వచ్చేసిందోచ్..
Sponsored links

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ సినిమా ఎవరితో ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుందని తేలిపోయింది. రేపు క్రిష్ణగారి పుట్టినరోజుని పురస్కరించుకుని మహేష్ బాబు చిత్రానికి సంబంధించి టైటిల్ రివీల్ కానుంది.

రేపు ఉదయం 9గంటల 9నిమిషాలకి ముహూర్తం ఫిక్స్ చేసారు. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సర్కారి వారి పాట అనే టైటిల్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తుంది. మహేష్ సినిమా అనౌన్స్ మెంట్ గురించి ఇచ్చిన అనౌన్స్ మెంట్ లో గవర్నమెంటు సీల్ వేసిన దస్తావేజులని చూపించారు. అంటే అది సింబాలిక్ గా టైటిల్ ని తెలియజేస్తుందని అర్థం అవుతుంది. 

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ తో పాటు జీఎమ్ బీ కలిసి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Sponsored links

Mahesh Movie announcement:

Mahesh 27th movie announcement

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019