త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై న్యూ అప్డేట్..

Sat 30th May 2020 03:10 PM
ntr,trivikram,rajamouli,ramcharan   త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై న్యూ అప్డేట్..
New update from NTR Trivikram movie.. త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ రోల్ పై న్యూ అప్డేట్..
Sponsored links

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్, తన తర్వాతి చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ అయిన హారికా హాసినీ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా ఇమేజ్ టార్గెట్ చేసిన ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడట.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిస్ందే. అదీ గాక అలవైకుంఠపురములో సినిమాతో త్రివిక్రమ్ నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేశాడు. దాంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గురించి అనేక ఊహాగానాలు బయటకి వస్తున్నాయి. ఈ చిత్రానికి టైటిల్ అయినను పోయిరావలె హస్తినకు అని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త బయటకి వచ్చింది.

త్రివిక్రమ్ స్క్రిప్టు పనుల్లో ఉండగానే ఎన్టీఆర్ రోల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో కనిపించనున్నాడట. ఇదివరకు గతంలో జూనియర్ ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో అదుర్స్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే మరోసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని అంటున్నారు. చూడాలి మరేం జరగనుందో..!

Sponsored links

New update from NTR Trivikram movie..:

NTR would do a duel role in Trivikram film

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019