పవన్ తగ్గించుకుంటాడా?

Thu 28th May 2020 01:35 AM
pawan kalyan,vakeel saab,remuneration,dil raju,power star  పవన్ తగ్గించుకుంటాడా?
Pawan Kalyan remuneration decreased for Vakeel saab పవన్ తగ్గించుకుంటాడా?
Sponsored links

పవన్ కళ్యాణ్‌ని ఎలాగోలా ఒప్పించి పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇప్పించాడు దిల్ రాజు. అది కూడా భారీ పారితోషకం, స్పెషల్ ఫ్లైట్ వంటి వాటితో దిల్ రాజు పవన్‌ని ఒప్పించాడు. డేట్స్ కూడా చాలా తక్కువగా అవసరమవుతాయని చెప్పి మరీ ఒప్పించి పింక్ రీమేక్ వకీల్ సాబ్ కి పవన్ ని దించాడు. పవన్ కూడా సినిమాలు చెయ్యాలి.. డబ్బు సంపాదించాలి అనే కాన్సెప్ట్ తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే పవన్ కోసం దిల్ రాజు అబ్బో చాలానే ఖర్చులు పెట్టాడు. అయితే పింక్ రీమేక్ మే 9 న విడుదయ్యేలా దిల్ రాజు పర్ఫెక్ట్ బడ్జెట్ వేసుకుని మరీ పవన్ తో సినిమా చేసాడు.

తాజాగా పింక్ రీమేక్ వకీల్ సాబ్ మే నుండి దసరాకి వెళ్ళింది అని.. దిల్ రాజు దసరా కి వకీల్ సాబ్ ని షిఫ్ట్ చేసాడని.. ఆ ప్లాన్ తోనే ఉన్నాడని అంటున్నారు. అయితే మే కల్లా సినిమా పూర్తయితే బడ్జెట్ కంట్రోల్ ఉండేదని.. కానీ ఇప్పుడు బడ్జెట్ పరిమితి దాటిపోతుంది. అసలే కరోనా లాక్ డౌన్ కష్టాలు. మరోపక్క పవన్ కళ్యాణ్ కి భారీ పారితోషకం. తాజాగా కరోనాతో హీరోల పారితోషకాలు తగ్గించుకోవాలని అంటున్నారు. మరోపక్క మూవీస్ బడ్జెట్ కంట్రోల్ అంటున్నారు. అయితే వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యణ్ పారితోషకం తగ్గించుకుంటాడనే ప్రచారం జరుగుతుంది. థియేటర్స్ రైట్స్ అమ్మడానికి ఇప్పుడు బయ్యర్లు అనుకూలంగా లేరు. భారీగా హక్కులు కొనలేరు కాబట్టే పవన్ పారితోషకం తగ్గించుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయమై దిల్ రాజు ఇంతవరకు పవన్‌తో చర్చించలేదని తెలుస్తుంది.

Sponsored links

Pawan Kalyan remuneration decreased for Vakeel saab:

Pawan Kalyan Vakeel saab Latest Update

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019