బన్నీని మెగాస్టార్ అంటున్నారేంటి..?

Thu 09th Apr 2020 12:41 PM
chiranjeevi,allu arjun,bunny,megastar,shreya ghoshal,rahul sharma  బన్నీని మెగాస్టార్ అంటున్నారేంటి..?
Why are they calling megastar..? బన్నీని మెగాస్టార్ అంటున్నారేంటి..?
Sponsored links

తెలుగు చిత్రపరిశ్రమకి మెగాస్టార్ అంటే ఒక్క చిరంజీవే అని అందరికీ తెలుసు. మెగాస్టార్ అన్న పేరు వినిపించగానే మదిలో మెదిలే ఒకే ఒక్క రూపం చిరంజీవి. మెగాస్టార్ అన్న పేరు మీదుగానే మెగా ఫ్యామిలీ అని వచ్చిందని తెలిసిందే. అయితే నిన్న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేసిన ఉత్తరాది జనాలు బన్నీని మెగాస్టార్ అని సంభోధించడం మెగా అభిమానుల్లో ఒకరకమైన ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ బన్నీకి బర్త్ డే విషెస్ చెప్తూ మెగాస్టార్ అంటూ అభివర్ణించింది. ఈ మేరకు శ్రేయా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఆమెకి థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చిన బన్నీ తాను మెగాస్టార్ ని కాదని ఖండించకపోవడంతో మెగా అభిమానులు కోపంతో రగిలిపోతున్నారు. ఒక్క శ్రేయా ఘోషల్ మాత్రమే కాదు క్రికెటర్ రాహుల్ శర్మ కూడా మెగాస్టార్ అనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అభిమానులు తమకి నచ్చినట్టుగా పిల్చుకోవడం కామనే. కానీ బన్నీ ఖండించకపోవడమే మెగా అభిమానులకి నచ్చలేదు.

ప్రస్తుతం ఈ విషయమై మెగా అభిమానులు అల్లు అర్జున్ మీద కోపంగా ఉన్నారు. చిరంజీవి సైరా ప్రమోషన్స్ టైమ్ లో అమితాబ్ బచ్చన్ ని ఉద్దేశిస్తూ, ఇండియన్ సినిమాకి మెగాస్టార్ ఆయనే అని, ఆ తర్వాతే మేమొస్తామని ఎంతో వినయంగా చెప్పాడని గుర్తు చేస్తున్నారు. మరి ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ ఏమంటారో..!

Sponsored links

Why are they calling megastar..?:

Shreya ghoshal calling bunny as Megastar

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019