ఆ ఊర మాసే మహేష్‌కి నచ్చలేదంటున్నారు

Thu 09th Apr 2020 08:28 AM
pushpa,rejected,mahesh babu,sukumar,allu arjun,oora mass look  ఆ ఊర మాసే మహేష్‌కి నచ్చలేదంటున్నారు
Mahesh rejected Bunny Pushpa Movie ఆ ఊర మాసే మహేష్‌కి నచ్చలేదంటున్నారు
Sponsored links

మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా కలలు కనడం లేదు. కేవలం సౌత్ దర్శకులతో సౌత్‌లో అదీనూ తెలుగుకే పరిమితమయ్యే ఆలోచనలు చేస్తున్నాడు. వరసగా ఇద్దరు డైరెక్టర్స్ ని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు ప్రస్తుతం ఏ దర్శకుడితోనూ కమిట్ అవ్వలేదు. ముందు సుకుమార్ తో క్రియేటివ్ డిఫ్రెన్సెస్ అన్నాడు. తర్వాత వంశి పైడిపల్లి కి హ్యాండ్ ఇచ్చాడు. అయితే సుకుమార్ తో మహేష్ చెయ్యాల్సిన సినిమాని అల్లు అర్జున్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో మూవీ లుక్ అండ్ టైటిల్ ని రివీల్ చేసారు. పాన్ ఇండియా లెవల్లో సుక్కు - బన్నీ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ లుక్ ఊర మాస్ గా ఉంది. అసలు అల్లు అర్జున్ గత రెండు నెలలుగా పుష్ప సినిమా కోసం హెయిర్ స్టయిల్ అండ్ గెడ్డం పెంచి రఫ్ గా తయారయ్యాడు. పుష్ప లుక్ లో అల్లు అర్జున్‌ని చూస్తే బాబోయ్ ఊర మాస్ అంటారు. మరి అల్లు అర్జున్ కి ఆ ఊర మాస్ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. కానీ ఆ లుక్ లో మహేష్ ని అస్సలు ఊహించలేం. హా పోకిరిలో చూడలేదా.. ఇదో లెక్క అనొచ్చు. కానీ మిల్కీ బాయ్ మహేష్ ని అల్లు అర్జున్ టైప్ లో ఊర మాస్ గా చూడలేం. అయితే అంత ఊర మాస్ లుక్ సెట్ కాదనుకున్నాడేమో మహేష్.. సుక్కు సినిమా వదిలేసాడు అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. లేదంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ మూవీ ని మహేష్ చేజార్చుకుంటాడా? అందులోను పాన్ ఇండియా ఫిలిం. మరి మహేష్ కి సుక్కు చెప్పిన లైన్ ఎందుకు నచ్చలేదో ఓ పాన్ ఇండియా మూవీని వదిలేసాడు అంటున్నారు.

Sponsored links

Mahesh rejected Bunny Pushpa Movie :

This is the reason for Mahesh Pushpa Rejected 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019