సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కలిస్తే.. RRR!!

Mon 30th Mar 2020 06:04 PM
rrr,rajamouli,story,ram charan,jr ntr,interview,top secret  సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కలిస్తే.. RRR!!
Rajamouli Revealed top secret about RRR సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కలిస్తే.. RRR!!
Sponsored links

రాజమౌళి.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న RRR సినిమా టైటిల్ లోగో అండ్ మోషన్ పోస్టర్ ని ఉగాది కానుకగా విడుదల చేసాడు. అలాగే రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రామ్ చరణ్ RRR అల్లూరి సీతారామరాజు యాక్షన్ వీడియోని విడుదల చెయ్యగా అమేజింగ్ రెస్పాన్స్ రావడంతో రాజమౌళి బాలీవుడ్ మీడియాకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా RRR థాట్ ఎలా వచ్చిందో చెప్పాడు. చిన్నప్పటి నుండి కామిక్ పుస్తకాలు చదివే నాకు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి హీరోలు కలిస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు అలాంటి ఆలోచనే ఈ RRRకి కలిసొచ్చింది. ఇక RRR షూటింగ్ చివరి దశలో ఉండగా... కరోనాతో అంతా అతలాకుతలం అయ్యింది. కరోనా సంక్షోభం అంతగా ఉంటుంది అని నేను అనుకోలేదు అని తెలిపాడు.

ఇక నా మైండ్ మొత్తం కరోనా ఆలోచనలతో నిండిపోయింది. ఒక పక్క కరోనా మరోపక్క రామ్ చరణ్ బర్త్ డే దగ్గరకి వచ్చేసింది ఇలాంటి టైం లో ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలనే ఆలోచనతో మోషన్ పోస్టర్ ని ఎలాగైనా చరణ్ బర్త్ డే కి ముందే విడుదల చెయ్యాలి అని. లేదంటే ఫాన్స్ హడావిడి తట్టుకోలేమని చరణ్ బర్త్ డే కి ముందే మోషన్ పోస్టర్ విడుదల చేసాం... RRR మోషన్ పోస్టర్ కి విశేషమైన ఆదరణ లభించింది. మా క్రియేటివిటీ ప్రజలకి నచ్చితే మాకెంతో తృప్తిగా ఉంటుంది అంటూ RRR విషయాలను బాలీవుడ్ మీడియాతో పంచుకున్నాడు రాజమౌళి. 

Sponsored links

Rajamouli Revealed top secret about RRR:

Rajamouli talks about RRR Story Birth

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019