వారి నిర్లక్ష్యమే మన ప్రాణాలను తీసింది...ఆనంద్ దేవరకొండ

Mon 30th Mar 2020 02:28 PM
anand devarakonda,coronavirus,covid 19  వారి నిర్లక్ష్యమే మన ప్రాణాలను తీసింది...ఆనంద్ దేవరకొండ
This situation comes because of negligence వారి నిర్లక్ష్యమే మన ప్రాణాలను తీసింది...ఆనంద్ దేవరకొండ
Sponsored links

చైనాలో పుట్టిందని చెప్పబడుతున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఒక్కొక్కరి గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చైనాలో మూడువేల మందికి పైగా ప్రాణాలని బలి తీసుకున్న ఈ వైరస్ ఇటలీలో మరింత వేగంగా విస్తరించింది. కేవలం ఇరవై రోజుల్లోనే అక్కడ కరోనా వ్యాధిగ్రస్థులు పెరిగిపోయారు. దాంతో ఇటలీ మొత్తం లాక్ డౌన్ ని విధించారు. కరోనా వల్ల మనదేశంలోనూ లాక్ డౌన్ విధించబడింది.

అయితే ఈ వైరస్ ని చైనా వాళ్లే ప్రపంచం మీద వదిలారని, బయో వార్ లో భాగంగానే ఈ వైరస్ ప్రపంచం మీద ప్రయోగించబడిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ప్రతీ చోట లాక్ డౌన్ విధిస్తున్న నేపథ్యంలో చైనా వుహాన్ నగరం మినహా బీజింగ్, షాంఘై వంటి పెద్ద పెద్ద నగరాలు లాక్ డౌన్ కి వెళ్లకపోవడంతో ఈ అనుమానాలకి మరింత బలాన్ని ఇస్తున్నాయి.

అయితే కరోనా వైరస్ మనుషుల నుండి మనుషులకి వ్యాపించదని చెప్తూ వచ్చిన చైనా అక్కడి నుండి ఏడు మిలియన్ల మందిని ప్రపంచ దేశాలకి పంపిందని సమాచారం. మనుషుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని తెలిసి కూడా చైనా కావాలనే ఇలా చేసిందని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రఖ్యాత వ్యక్తులు రాస్తున్న ఈ సమాచారాన్ని టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ సపోర్ట్ చేశాడు. చైనా వాళ్ళు అంతమందిని తమదేశం నుండి పంపకుండా ఉంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేది కాదని చెప్పాడు.

Sponsored links

This situation comes because of negligence:

This situation comes because of those negligence

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019