రాజమౌళికి ఆ విషయంలో ఇబ్బంది తప్పదా..?

Mon 30th Mar 2020 03:55 PM
rajamouli,rrr,ntr,ramcharan   రాజమౌళికి ఆ విషయంలో ఇబ్బంది తప్పదా..?
Will Rajamouli get those problems రాజమౌళికి ఆ విషయంలో ఇబ్బంది తప్పదా..?
Sponsored links

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి అభిమానుల్లో అంచనాలు పెంచేశాడు. కొమరం భీమ్, రాం చరణ్ లని నిప్పు నీరుగా అభివర్ణించిన రాజమౌళి నిప్పుకణిక అల్లూరి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ లుక్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చినప్పటికీ ఎన్నో ప్రశ్నలని రేపింది. రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూపిస్తున్న రాజమౌళి పోలీస్ డ్రెస్ లో ఎందుకు చూపించాడో అర్థం కాలేదు.

అదీ గాక ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి చూపించిన సీతారామరాజు లుక్ కి మనకు తెలిసిన సీతారామరాజు లుక్ కి చాలా తేడాలున్నాయి. రామ్ చరణ్ లాగే ఎన్టీఆర్ లుక్ కూడా ఇదే విధంగా ఉంటుందని అర్థం అవుతుంది. ఇద్దరు చరిత్రలో మిగిలిపోయిన పురుషుల గురించిన చరిత్ర వక్రీకరించారన్న నేపథ్యంలో మనోభావాలు దెబ్బతిన్నాయని ముందుకు రావచ్చు. అయితే అలా ముందుకొచ్చే వారు ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి.

రాజమౌళి చెప్పినట్టు ఇది కల్పిత కథ.. అలాగే 1920 ప్రాంతంలో అసలేం జరిగిందన్నదానికి రుజువులు కూడా లేవు. కాబట్టి వారు వాదించడానికి కూడా ఉండదు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి.. రాజమౌళి వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మన తెలుగు హీరోలపై సినిమా తీస్తున్నాడంటే అది మనకు గౌరవం తెచ్చే విధంగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరి ఈ విషయాలని మనోభావాల గురించి లేవనెత్తే వారు అర్థం చేసుకుంటే మంచిది. అందువల్ల రాజమౌళికి ఈ విషయంలో ఇబ్బంది ఉండదని తెలుస్తుంది.

Sponsored links

Will Rajamouli get those problems:

Will Rajamouli get those problems

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019