Advertisement

తనీష్ ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్ విడుదల

Mon 23rd Mar 2020 07:03 PM
maha prasthanam movie,tanish,first look,motion poster  తనీష్ ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్ విడుదల
maha prasthanam movie motion poster and first look released తనీష్ ‘మహాప్రస్థానం’ ఫస్ట్ లుక్ విడుదల
Advertisement

'గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే..ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం’’ అంటూ మహాప్రస్థానం మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ ట్యాగ్ లైన్ తో తనీష్ హీరోగా వస్తున్న మహాప్రస్థానం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. కత్తి పట్టుకున్న తనీష్ శత్రువులను తుదముట్టిస్తూ వయలెంట్ లుక్ లో కనిపించారు. భావోద్వేగం నిండిన వాయిస్ ఓవర్ తో మొదలైన మోషన్ పోస్టర్...మహాప్రస్థానం టైటిల్ సాంగ్ బిట్ తో పూర్తయింది. సినిమా కథలోని లోతును, ఎమోషనల్ కిల్లర్ గా తనీష్ పాత్రలోని ఫైర్ ను మోషన్ పోస్టర్ చూపించింది. ఓంకారేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు జాని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముస్కాన్ సేథీ నాయికగా నటిస్తోంది. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచి క్వాలిటీతో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న మహాప్రస్థానం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ అంతే వేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనుల్లో ఉన్న ఈ సినిమా వేసవి విడుదలకు సిద్ధమవుతోంది. 

ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా దర్శకులు జానీ మాట్లాడుతూ...ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనే ట్యాగ్ లైన్ కు సరిగ్గా సరిపోయే సినిమా మహాప్రస్థానం. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లను విడుదల చేశాం. తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్ గా తనీష్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుంది. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చేయించాం. గెరిల్లా పద్ధతిలో శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేశాం. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, సమ్మర్ లో మహాప్రస్థానం చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. అన్నారు.

రిషిక ఖన్నా, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ ప్రేమ్, కథా కథనం దర్శకత్వం - జానీ.

maha prasthanam movie motion poster and first look released:

Tanish maha prasthanam movie Latest Update 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement