ఆ డైరెక్టర్‌కు బన్నీ ఛాన్స్ ఇస్తాడా.. షాకిస్తాడా!?

Wed 26th Feb 2020 01:43 PM
stylish star allu arjun,bunny,surender reddy,racegurram  ఆ డైరెక్టర్‌కు బన్నీ ఛాన్స్ ఇస్తాడా.. షాకిస్తాడా!?
News About Stylish Star Allu Arjun! ఆ డైరెక్టర్‌కు బన్నీ ఛాన్స్ ఇస్తాడా.. షాకిస్తాడా!?
Sponsored links

‘అల వైకుంఠపురములో..’ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఆనందానికి అవధుల్లేవ్. గ్యాప్ ఇచ్చినప్పటికీ.. గట్టిగానే బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాడు. దీంతో ఆయనతో సినిమా చేయడానికి.. ఆయనతో ఇదివరకే తెరకెక్కించిన సినిమాల సీక్వెల్‌కు దర్శకులు క్యూ కడుతున్నారట. ఇటు బన్నీ ఇంటికి.. అటు గీతా ఆర్ట్స్‌కు కుర్ర డైరెక్టర్స్‌ క్యూ కట్టేస్తున్నారట. వారిలో అప్పట్లో అల్లు అర్జున్‌కు ‘రేసుగుర్రం’ లాంటి హిట్టిచ్చిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడట. వాస్తవానికి ఈయనపై ప్రస్తుతం మెగా ఫ్యామిలీ డైరెక్టర్‌గా ముద్రపడిపోయింది. అందుకేనేమో మెగా ఫ్యామిలీని వదిలి బయటికి రాలేపోతున్నారు.

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’కు ముందే ఒక కథ.. తాజాగా మరో కథను సురేందర్ సిద్ధం చేసుకున్నారట. అయితే హీరో ఎవరు..? ఎవర్ని తీసుకుంటే బాగుంటుంది..? మెగా హీరోలనే తీసుకోవాలా..? లేకుంటే వేరొకర్ని తీసుకోవాలా..? అని ఆలోచించిన సురేందర్‌కు బన్నీపై మనసు పడిందట. ఈ క్రమంలో ‘రేసుగుర్రం’ సీక్వెల్‌ తీయడానికి లేదా.. మరో కథ అయినా సరే బన్నీతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. తన మనసులోని మాటను కూడా మెగా ఫ్యామిలీకి.. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్‌గా బాగా కావాల్సిన బన్నీవాస్ చెవిన పడేశారట. అయితే ఆయన బన్నీకి కూడా చెప్పేశాడట.

బన్నీ కోసం విక్రమ్ కుమార్, లింగుస్వామి, మురుగదాస్, వేణు శ్రీరామ్ లాంటి చాలా మంది డైరెక్టర్లు రెడీగా ఉన్నప్పటికీ ఇక మళ్లీ వెనక్కి వెళ్లి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ ప్రాజెక్టులన్నీ పక్కనెట్టేశాడట. ఈ క్రమంలో సురేందర్ నుంచి కబురు రావడంతో బన్నీ ఆలోచనలో పడ్డాడట. త్వరలోనే కూర్చోని కథ విందామని.. నచ్చితే సుకుమార్ తర్వాత సురేందర్‌కే చాన్స్ ఇవ్వాలని బన్నీ అనుకుంటున్నాడట. మరి ఆ కథ నచ్చి సురేందర్‌కు బన్నీ చాన్సిస్తాడో లేకుంటే సారీ సార్ అంటూ షాకిస్తాడో తెలియాల్సి ఉంది. ఇందులో నిజానిజాలెంతో తెలిసేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Sponsored links

News About Stylish Star Allu Arjun!:

News About Stylish Star Allu Arjun!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019